రష్యాను ఎదుర్కోవడానికి మరింత సాయం అందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రపంచదేశాలను విజ్ఞప్తి చేశారు. "మా దేశానికి ఆస్ట్రేలియా అందిస్తున్న సాయం చరిత్రలో నిలిచిపోతుంది. ఆస్ట్రేలియా సహా ఇతర దేశాల సాయాన్ని ఉక్రెయిన్ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. మీ సహకారం మా చరిత్ర పుస్తకాల్లో రాసుకుంటాం" అని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. రష్యా 11 లక్షల మంది ఉక్రెయిన్ ప్రజలను తమ దేశానికి తరలించిందని ఆరోపించారు.