ఐపీఎల్-2022లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ సీజన్లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ జట్టు, మయాంక్ అగర్వాల్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టును మంగళవారం ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్లలోనూ మ్యాచ్ విన్నర్లు ఉండడంతో ఏ జట్టు గెలుస్తుందోననే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
పంజాబ్ కింగ్స్ (తుది జట్టు): మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రిషి ధావన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ
గుజరాత్ టైటాన్స్ (తుది జట్టు): వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, ప్రదీప్ సాంగ్వాన్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ