కర్నూలులో దారుణం చోటుచేసుకుంది. ఫేస్ బుక్ లో పరిచయమైన యువకుడు తనను బ్లాక్ మెయిల్ చేయడంతో ఓ యువతి అతడిని చెప్పుతో కొట్టింది. పోలీసుల కథనం మేరకు.. ఫేస్‌బుక్ లో షానవాజ్ అనే యువకుడికి ఏలూరుకి చెందిన యువతి పరిచయమైంది. పరిచయం అయిన కొత్తలో ఆ యువతి పోటోలను షానవాజ్ తీసుకున్నాడు.
ఆ తర్వాత ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతానంటూ డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. ఆ యువతి అతడికి డబ్బులు కూడా ఇచ్చింది. అయినా ఆ వ్యక్తి ఆ యువతి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో యువతి ఆగ్రహంతో ఆలూరుకి చేరుకొని షానవాజ్ ను చెప్పుతో కొట్టింది. అంతేకాదు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa