జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన జరగనున్నట్లు జెడ్పీ సీఈఓ ఎం. వెంకటసుబ్బయ్య బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశానికి కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాంతో పాటు ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులకు హాజరు కానున్నారని తెలిపారు. సమావేశంలో రెండు జిల్లాలకు సంబంధించి గ్రామీణ నీటి సరఫరా, గృహ నిర్మాణం, వైద్యఆరోగ్య శాఖలపై సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరగనున్న ఈ సమావేశానికి జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ, కోఅష్షన్ సభ్యులు హాజరు కావాలని సీఈఓ కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa