వంగర మండలానికి చెందిన మరడాన దివాకర్ అనుమాన స్థితిలో మరణించిన విషయం విదితమే. ఇది హత్య. ఆత్మహత్య అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఆయన ఒంటిపై గాయాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు బలమైన గాయాలు ఉన్నట్లు వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో ఇది హత్య లేక ఆత్మహత్య అన్నా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వంగర మండలం పటువర్ధనం గ్రామానికి చెందిన దివాకర్ (33) బావిలో శవమై తెలి కనిపించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సురేంద్ర నాయుడు తెలిపారు. పాటువర్ధనం గ్రామానికి చెందిన మరడాన దివాకర్ తన బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా తెర్లాం మండలం సుందరాడ గంగాడా మధ్య పిల్ల కాలువ పక్కన గల బావిలో శవమై తేలడంతో దివాకర్ తండ్రి ఎల్లంనాయుడు తెరలామ్ పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఎస్ఐ సురేంద్ర నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.