కొత్తూరు పోలీసులు బుధవారం నివగాం రోడ్డులోని కుంటిభద్ర పెట్రోల్ బంక్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఖైనీ గుట్కా కేసులో ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఎస్ ఐ అడిగర్ల చంద్రకళ పేర్కొన్నారు. నేతాజీనగర్ కాలనీకి చెందిన కుంచాడ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై ఒడిశా నుండి రూ. 2100లు విలువ చేసే ఖైనీ గుట్కాలు అక్రమంగా తరలిస్తుండగా పోలీసు పట్టుకున్నట్లు కేసు నమోదు చేసి లక్ష్మీ నారాయణ ను అరెస్ట్ చేసి కొత్తూరు కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్ ఐ తెలిపారు.