కొత్తూరు మండలంలోని కాకర గూడ గ్రామానికి చెందిన గిరిజన వివాహిత జన్ని ఆదిలక్ష్మి (37)కడునొప్పితాళలేక ఆత్మహత్యకు పాల్ప డింది. ఈమేరకు ఎస్ ఐ ఎ. చంద్రకళ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కాకరగూడ కు చెందిన జన్ని ఆదిలక్ష్మి గత కొద్దినెలలుగా కడుపు నొప్పితో బాధపడు తుంది. ఆసుపత్రుల్లో వైద్యం పొందు తున్న కడుపునొప్పి నయం కాక పోవడంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడడంతో ఆమెను కుటుంబసభ్యు లు కురిగాం పి హెచ్సీ కి తీసుకువెళ్లగా, ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఒడిశా లోని గజపతి జిల్లా కేంద్రం పర్లాఖేముడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యం పొందుతూ, ఆదిలక్ష్మి మృతి చెందినట్లు ఎస్ ఐ తెలిపారు. ఈ సం ఘటనపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.