హిరమండలం మండలంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు 104 వాహనం అందజేస్తుందని, వాటిని సద్వినియోగించుకోవాలని వాహన వైద్యాధికారి వి. హర్షిత రెడ్డి సూచించారు. అంబావల్లి గ్రామ సచివాలయ పరిధిలో 104 వాహనం ద్వారా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ మేరకు 44 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రజలకు ఆరోగ్య విద్యపై అవగాహన కల్పించారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని, వడదెబ్బ తగిలితే వైద్యాధికారిని సంప్రదించాలని ఆయన సూచించారు. 40 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు తప్పనిసరిగా మధుమేహం, అధిక రక్తపోటు, ఈసీజీ పరీక్షలు తప్పక చేయించుకోవాలని, 104 వాహనంలో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, వాటిని సద్వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈయనతో పాటు డాటా ఎంట్రీ ఆపరేటర్ టీఎస్ఎస్ఎస్ సీతారామ రాజు, ఏఎన్ఎం సీహెచ్ లక్ష్మి, ఎంఎలెచ్పీ వినీత, పైలట్ టి. అప్పారావు, ఆశ కార్యకర్తలు ఎల్. సుగుణ, ఈశ్వరమ్మ తదితరులు ఉన్నారు.