శ్రీకాకుళం జిల్లాలో ఉచిత విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు అమర్చామని, రైతుల ఖాతాలనుంచి చెల్లింపులు జరుగుతున్నాయని అధికారులు నిన్న జరిగిన సీఎం సమావేశంలో తెలిపారు . 2020-21 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 26,083 కనెక్షన్లకు 101.51 మిలియన్ యూనిట్ల కరెంటు ఖర్చయ్యిందని అలానే 2021-2022 ఆర్థిక సంవత్సరంలో కనెక్షన్లు పెరిగి 28,393కు చేరుకున్నాయని, అయినా సరే 67.76 మిలియన్ యూనిట్ల కరెంటు మాత్రమే వినియోగించారని అధికారులు తెలియచేసారు. అలానే సంస్కరణల వల్ల, రైతుల ఖాతాల ద్వారా చెల్లింపులు వల్ల కనెక్షన్లు పెరిగినా 33.75 మిలియన్ యూనిట్ల కరెంటు ఆదా అయ్యిందని, రైతులకూ నాణ్యమైన విద్యుత్ అందుతోందని సీఎం జగన్ కి తెలిపారు.