ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడ మంకీ ఫీవర్ కలకలం.. ప్రజల్లో టెన్షన్

national |  Suryaa Desk  | Published : Fri, May 06, 2022, 12:14 PM

కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలో మంకీ ఫీవర్​ కలకలం రేపుతోంది. ఈ వ్యాధి సోకి ఈనెల 3న సాగర్​ తాలుకా అరళగోడ్​కు చెందిన రామస్వామి కరమానే(55) అనే వ్యక్తి మృతి చెందారు. దీంతో జిల్లావ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్​ లోనూ ఉత్తర కన్నడ జిల్లా సిద్ధాపుర్​ తాలుకాలో మంకీ ఫీవర్​ తో 85 ఏళ్ల వృద్ధురాలు చనిపోయింది.


శివమొగ్గ జిల్లాలోని సాగర్​, హోసనగర్​, తీర్థనహళ్లి మంకీ ఫీవర్​ హాట్​ స్పాట్లుగా మారాయి. చిన్న జ్వరం వచ్చినా అక్కడి జనాలు ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారు. 2022లో జనవరి నుంచి ఏప్రిల్​ మధ్యలో మొత్తం 42 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వ్యాధి బారిన పడిన వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు.


మంకీ ఫీవర్​ ను క్యాసనుర్​ ఫారెస్ట్​ డిసీస్​(కేఎఫ్​డీ) అని అంటారు. దీనిని 1957లో తొలిసారి శివమొగ్గ జిల్లాలోని క్యాసనుర్ ​లో గుర్తించారు. ఇది కోతుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. అందుకే దీనిని మంకీ ఫీవర్ ​గా పిలుస్తారు. కోతులకు ఉండే టిక్​-బార్న్​(గోమార్లు) మనుషులను కుట్టడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. టిక్స్​ ఎక్కువగా నెమళ్లు, పక్షులు, కుందేళ్లు, కోతుల్లో కనిపిస్తుంటాయి. కోతి చనిపోతే వాటికి రక్తం అందదు. దీంతో అవి మరో జీవిపైకి చేరతాయి. మనిషిని కరిస్తే జ్వరం, జలుబు వంటి అనారోగ్యాలు వస్తాయి. దానిని నిర్లక్ష్యం చేస్తే మరణం కూడా సంభవించే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.


మంకీ ఫీవర్​ లక్షణాలు:


- గోమార్లు కుట్టిన కొన్ని రోజుల్లోనే జ్వరం


- తొలి వారంలో తీవ్రమైన జ్వరం, నీరసం, ఆహారం తినాలనిపించకపోవటం


- రెండో వారంలో కళ్లు ఎర్రగా మారటం, జ్వరం మరింత పెరగడం, కళ్ల నుంచి రక్తం రావటం


- శరీరంలోని ఇతర అవయవాలు సైతం దెబ్బతినడం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com