రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాడిపర్తి గ్రామంలో కొడుకు రావాల్సిన వాటా నిరాకరించడంతో తండ్రి మొగులమోని వెంకటయ్య పై కాళ్ళపై గొడ్డలితో దాడి చేసాడు.తీవ్రంగా గాయపడిన వెంకటయ్యను చికిత్స నిమిత్తం ఎల్బీనగర్ లోని కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. తాడిపర్తి గ్రామానికి చెందిన వెంకటయ్య కు ఇద్దరూ కొడుకులు ఒక్క కూతురు. మోగులయ్యకు 6 ఏకరాల భూమిలో చిన్న కొడుకుకు రెండు ఏకరాలు, కూతురుకు రెండు ఏకరాలు పట్టా చేశారు.
పెద్ద కొడుకు పర్వతాలకు పట్ట చేయకపోవడంతో పలుమార్లు గొడవ పడ్డారు. పెద్దల సమక్షంలో మాట్లాడిన పలితం లేకపోవడంతో కోపం పెంచుకున్న పర్వతాలు పిల్లి పల్లి వద్ద తమ వ్యవసాయ పొలం వద్ద తండ్రి పై గొడ్డలి తో కాళ్ళు నరికాడు.సంఘట స్థలానికి చేరుకున్నా పోలీసులు నిందితుడు పర్వతాలు పరారీలో యాచారం సి.ఐ లింగయ్య తెలిపారు.