వైఎస్ఆర్ చేయూతలో అర్హులకు సాయం నిలిపివేయడంపై హైకోర్టు విచారణ చేపట్టింది. పెదకూరపాడు(మ) గారపాడుకు చెందిన 26 మంది గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించగా.. ఏడుగురు వాలంటీర్లకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. 'వాలంటీర్ల సర్వీసు నిబంధనలు ఏంటి? వాలంటీర్లు తప్పు చేస్తే ఎవరు శిక్షిస్తారు? లబ్ధిదారుడిని వాలంటీర్లు ఎంపిక చేయడం ఏంటి?' అనే ప్రశ్నలతో అఫిడవిట్ సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.