అవనిగడ్డ నియోజకవర్గంలో 3 మండలాలలో మరియు గ్రామాల్లో మంచినీటి సమస్యలు గురించి అడిగి తెలుసుకొని, ఈ వేసవికాలంలో వర్షాలశాతం తక్కువగా ఉండడంతో ముందస్తుగా ప్రభుత్వ అధికారులు, పంచాయతీ సక్రటరీలు, ఆర్. డబ్లయుఎస్ ఏఈ డిఈలు, ఎలక్ట్రికల్ ఏడిఏ, సచివాలయం ఈఏ ఎంపీడీఓలతో భేటీ అయి స్కీమ్స్ కు, లేఔట్స్ కి కరెంటు ప్రాబ్లెమ్ తలెత్తకుండా ప్రజలకు ఈ రెండూ నెలలు ఎటువంటి త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ఉండాలని అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు అధికారులను ముందుగా సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి పంచాయితీ లకు వాటర్ అవసరం అయిన అన్ని సదుపాయాలను ముందుగానే చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 3 మండలాల ఈఓపిఆర్డిలు, పంచాయతీ సెక్రటరీలు, ఆర్. డబ్ల్యూఎస్ ఏఈ, ఈఏ, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు.