ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టుకు ఆదివారం నుంచి జూన్ 10 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. హైకోర్టు కార్యకలాపాలు తిరిగి జూన్ 13న ప్రారంభమవుతాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆదేశాల మేరకు సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటయ్యాయి. వెకేషన్ కోర్టుల్లో హెబియస్ కార్పస్, బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్లు, అత్యవసర వ్యాజ్యాలు మాత్రమే దాఖలు చేయాలని హైకోర్టు స్పష్టంచేసింది.