అహోబిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన సోమవారం ఎగువ అహోబిలంలోని జ్వాలా నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను శేషవాహనంపై ఊరేగించారు. మధ్యాహ్నం ఉత్సమూర్తులను అర్చకులు అభిషేకాలు, రాత్రి భేరీ పూజలను నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు విశేషంగా తరలివచ్చి ఉత్సవాలను తిలకించారు.