కోవెలకుంట్లలో పంట దిగుబడులను కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కంపెనీ యాజమాన్యంపై కోవెలకుంట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని లింగాల గ్రామానికి చెందిన ఏర్వా వెంకటశేషి రెడ్డి అనే రైతు కర్ణాటక రాష్ట్రం ఎలనంకకు చెందిన రాఘవేంద్ర ట్రేడర్స్ యజమాని ఆనంద్ బాబు కు గత నెలలో మిరప దిగుబడులు విక్రయించారు. నెల రోజుల కాలపరిమితి పూర్తి కావస్తున్నా, డబ్బులు చెల్లించకుండా ఉండడమే కాకుండా స్పందించకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.