కడప నగర శివార్లలోని చలమారెడ్డిపల్లె బండి కనుమలో వెలిసిన శ్రీ భువనేశ్వరీదేవి ఆలయంలో వైశాఖ శుద్ధ అష్టమిని పురస్కరించుకుని శ్రీ భగళాముఖి దేవి జయంతిని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున అభిషేకాలు, అర్చనలు, విశేష అలంకారం నిర్వహించి భక్తుల దర్శనానికి అనుమతించారు. రాత్రి ఉత్సవ మూర్తికి ప్రాకారోత్సవం నిర్వహించి వైభవ హారతులు పట్టారు. ఆలయ అధ్యక్షులు దండు లక్ష్మీకళ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో శ్రీ కాలభైరవస్వామి నూతన విగ్రహాన్ని నిర్వాహకులు నాగేంద్రప్రసాద్ పర్యవేక్షణలో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా అర్చకులు చంద్ర స్వామి, గదాధరస్వామి ధాన్యాధివాసం, జలాధి వాసం కూడా నిర్వహించారు. స్థానిక ప్రముఖులు వెంకట సుబ్బయ్య పూజల్లో పాల్గొన్నారు.