నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడటం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పెళ్లికి అంగీకరించలేదని బంగారు భవిష్యత్తు ఉన్న యువతిపై సురేష్ రెడ్డి అనే ప్రేమికుడు కాల్పులు జరిపి దారుణంగా చంపడం జరిగింది. అనంతరం అతను కూడా కాల్చు కోవడం జరిగింది. ప్రేమ పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదని ఈ ఘాతుకానికి ఒడి కట్టినట్లు సమాచారం. మృతులు సురేష్ రెడ్డి, కావ్య లుగా గుర్తించారు. ఈ ఘటనపై స్పందించిన నారా లోకేష్ మాట్లాడుతూ... బీహార్ ని తలపించే విధంగా ఏపీలో గన్ కల్చర్ రావడం దురదృష్టకరం. ఆడబిడ్డలపై పెరిగిపోతున్న ఈ అఘాయిత్యాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలి అని అన్నారు .