మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి, టీడీపీ నేత నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని కొండాపూర్ లోని నివాసంలో నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏ కేసులో, ఎందుకు అరెస్ట్ చేశారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. టెన్త్ పేపర్ లీకేజీ ఆరోపణలపైనే ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.