ఆశని తుఫాను ప్రభావం కారణంగా అరటి చెట్లు నేలకు వాలి పోవటంతో అరటి సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పామర్రు నియోజకవర్గ పరిధిలోని తోట్లవల్లూరు మండలంలో పలు గ్రామాల్లో అరటి పంటను సాగు చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా విచినటువంటి ఈదురు గాలులకు అరటి చెట్లు నేలకొరిగాయి.