మాజీ మం త్రి నారాయణ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రశ్నాప్రత్రాల లీకేజీనే జరగలేదని సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారని గుర్తు చేశారు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను ప్రభుత్వం అరెస్ట్ చేసిందని మండిపడ్డారు. విద్యార్థులకు మంచి విద్యను అందిస్తున్న నారాయణ విద్యాసంస్థల పేరును దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు. అక్రమ కేసులతో ఈ విద్యాసంస్థలను దెబ్బతీస్తే... విద్యార్థులు నష్టపోతారని చెప్పారు. నారాయణను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.