తీవ్రతుపాను నుంచి తుపానుగా బలహీనపడిన అసని. గురువారం ఉదయానికి వాయు గుండంగా బలహీనపడనున్న తుపాను. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి. మీ వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలింది. ప్రస్తుతం మచిలీపట్నంకు 60 కి. మీ. , కాకినాడకు 180 కి. మీ. , విశాఖపట్నంకు 310 కి. మీ. , గోపాలపూర్ కు 550 కి. మీ. , పూరీకు 630 కి. మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తరం-ఈశాన్య దిశగా కదులుతూ మచిలీపట్నం, నర్సాపూరం, యానాం, కాకినాడ, తుని, విశాఖపట్నం తీరాల వెంబడి కదులుతూ సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం. బుధవారం ఉమ్మడి కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75-95 కిమీ వేగంతో ఈదురగాలులు వీస్తాయి.