గ్రామపంచాయతీలో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కనీసవేతనాలు అమలు చేయాలని , పని భారాన్ని తగ్గించాలని కోరుతూ సంతకవిటి ఎంపిడిఓ ఆఫీస్ వద్ద జరిగిన ధర్నా లో సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ , రామ్మూర్తినాయుడు రాష్ట్ర ప్రభత్వాన్ని డిమాండ్ చేశారు. సంతకవిటి మండలం బుధవారం గ్రామపంచాయతీలో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్ కార్మికుల సమస్యలపై ఎంపీడీవో ఆఫీస్ వద్ద జరిగిన ధర్నా నుద్దేశించి రామ్మూర్తి నాయుడు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు కనీస వేతనం 20000 అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కార్మికులందరికీ జీవో నెంబర్ 57 ప్రకారం కనీస వేతనం పదివేల రూపాయలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించి పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని కోరారు. కార్మికులకు ప్రభుత్వమే గుర్తింపు కార్డు యూనిఫార్మ్ ఇవ్వాలని, పనిచేస్తున్న కార్మికులు ఎక్స్గ్రేషియా చెల్లించాలని దహనసంస్కారాలు ఖర్చులకు 15 వేల రూపాయలు ఇవ్వాలని, రాజకీయ వేధింపులు తొలగింపు లేకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్ లో అమలు చేసి పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రతి నెల 5వ తేదీ లోపు కార్మికులకు వేతనాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని బకాయి వేతనాలు వెంటనే చెల్లించి కార్మికులను ఆదుకోవాలని ధర్నాలు నిర్వహించారు.
అనంతరం ఎంపీడీవో కి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ అంబాసిడర్ మండల నాయకులు అచ్చుతురావు, రమేష్ , అప్పారావు , చిన్నారావు , రాము, లక్ష్మణా రావు, సూరి మొదలగు వారు పాల్గొన్నారు.