పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జై ఆంధ్ర కాలనీలో దినేష్ యువకుడు ఆత్మహత్య ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నేడు దినేష్ పెళ్లి. ఏమైందో ఏమో కానీ పెళ్లి కొన్ని గంటల ముందే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో జైఆంధ్ర కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మల్కాపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.