ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ కీలక ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 11, 2022, 01:44 PM

ఏపీలో తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్‌ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుఫాన్ నేపథ్యంలో హై అలర్ట్‌ గా ఉండాలన్నారు. తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తం అవసరమని కలెక్టర్లు, అధికారులకు సీఎం జగన్ సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అవసరమైన చోట సహాయ పునరావాస శిబిరాలను తెరవాలని చెప్పారు. సహాయ శిబిరాలకు తరలించిన ఒక వ్యక్తికి రూ.1000, కుటుంబానికి రూ.2వేల చొప్పున ఇవ్వాలని ఆదేశించారు. సెంట్రల్‌ హెల్ప్‌ లైన్‌తో పాటు, జిల్లాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లు సమర్థవంతగా పనిచేసేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. వచ్చే కాల్స్‌ పట్ల వెంటనే స్పందించాలన్నారు.

అసని తుఫాన్ ప్రభావంతో విశాఖ, తుర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. విశాఖపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఏపీ తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మొహరించారు. తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు
కాకినాడ కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 18004253077
కాకినాడ ఆర్డీవో ఆఫీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 0884-2368100
శ్రీకాకుళం: 08942-240557
తూర్పు గోదావరి: 8885425365
ఏలూరు కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 18002331077
విజయనగరం: 08922-236947
పార్వతీపురం మన్యం: 7286881293
మచిలీపట్నం కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 08672 252572
మచిలీపట్నంం ఆర్డీవో ఆఫీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 08672 252486
బాపట్ల కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 8712655878, 8712655881
ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 90103 13920
విశాఖ: 0891-2590100,102
అనకాపల్లి: 7730939383






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com