విశాఖ రుషికొండ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తవ్వకాలు జరపరాదని ఎన్జీటీ ఆదేశించింది. ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 6న ఎన్జీటీ బెంచ్ విచారణ జరిపింది. ఇప్పటి వరకు జరిగిన తవ్వకాలపై అధ్యయనానికి సంయుక్త కమిటీని ఎన్జీటీ నియమించింది. ఏపీ కోస్టల్ మేనేజ్ మెంట్ అథారిటీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని స్పష్టం చేసింది. నెల రోజుల్లో కమిటీ నివేదిక అందించాలని ఆదేశించింది.