ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియురాలి కోసం ఊరు మొత్తం కరెంట్ తీసేశాడు!

national |  Suryaa Desk  | Published : Wed, May 11, 2022, 04:54 PM

ప్రేమ గుడ్డిది అనే సామెత ఉంది. ఇది నిజమేనని కొన్ని సందర్భాలు రుజువు చేస్తుంటాయి. ప్రేమ మత్తులో ఉన్నవారు ఏదైనా చేసేందుకు సిద్ధం అవుతుంటారు. కొంత మంది దొంగతనాలు చేస్తే, మరికొంత మంది అందరినీ వదులుకుని పరార్ అవుతుంటారు. తాజా ఓ ప్రియుడు అందరి కంటే విభిన్నం అనిపించుకున్నాడు. ఎవరూ చేయని విధంగా తన ప్రియురాలి కోసం ఓ సాహసం చేశాడు. ఈ ఆసక్తికర కథనానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


బీహార్‌లోని పూర్నియ జిల్లాలోని గణేశ్‌పూర్‌ గ్రామంలో ఇటీవల రాత్రైతే చాలు కరెంట్ పోతోంది. ఈ విద్యుత్ కోతలు చుట్టు పక్కల ఏ గ్రామాలకూ లేవు. అయితే తమ గ్రామానికే ఎందుకు విద్యుత్ కోతలు ఉన్నాయని ఆలోచించిన గ్రామస్తులకు అనుమానం తలెత్తింది. ఎవరో కావాలనే ఈ పనికి పాల్పడుతున్నట్లు భావించి, నిఘా పెట్టారు. చివరికి ఓ వ్యక్తిని పట్టుకున్నారు. తీరా గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ ఈ పని చేస్తున్నట్లు తెలుసుకుని నివ్వెరబోయారు. తన ప్రియురాలిని చీకట్లో కలుసుకునేందుకు గ్రామం మొత్తం కరెంట్ తీసేస్తున్నట్లు తెలుసుకుని అంతా కంగుతిన్నారు. దీంతో ఆ ప్రేమికుడిని ఊరంతా కలిసి చితక్కొట్టారు. ఆ తర్వాత వారిని ఊరంతా ఊరేగించారు. చివరికి తమకు కరెంట్ పోకూడదనే ఉద్దేశంతో ఆ ప్రేమ జంటకు సర్పంచ్, గ్రామ పెద్దలు కలిసి పెళ్లి చేసేశారు. ఈ వివాదంపై ఎవరూ కేసు పెట్టలేదని, ఫిర్యాదు చేస్తే ఆ ఎలక్ట్రీషియన్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa