పార్టీ కార్యాలయానికి బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు శంకుస్థాపన చేశారు. బుధవారం ఆయన కర్నూలు నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా బీజేపీ శాఖకు సంబంధించి కొత్తగా నిర్మించనున్న పార్టీ కార్యాలయ భవనానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్, పార్టీ యువ నేత విష్ణువర్ధన్ రెడ్డి సహా పార్టీ జిల్లా శాఖకు చెందిన పలువురు నేతలు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa