ఉత్తర కాశ్మీర్‌లోని బందిపురాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది బుధవారం హతమయ్యాడు.అతని వద్ద నుంచి ఒక ఏకే రైఫిల్, 3 మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఐజీపీ కశ్మీర్ విజయ్ కుమార్ తెలిపారు.మరో ఇద్దరు ఉగ్రవాదుల కోసం అన్వేషణ కొనసాగుతోందని ఐజీపీ తెలిపారు. మరోవైపు దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లోని మర్హమా బిజ్‌బెహరా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa