భక్తులతో మలం తినిపించి, మూత్రాన్ని తాగించిన ఓ దొంగ బాబాను థాయిలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తావీ నన్రా (75) అనే బాబా తనని తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు. తన మలమూత్రాలు ఔషధంలా పనిచేస్తాయని ప్రకటించాడు. అతన్ని నమ్మిన భక్తులు అతడి మలాన్ని ముక్కుమూసుకుని మరీ తినేవారు. అతని మూత్రాన్ని తాగేవారు. ఆ బాబా ఉండే చోట పోలీసులు 11 శవాలను గుర్తించారు. ఆ బాబా మలం వాసన రాదని, కళంకిత మనస్సు ఉన్న వారికే కంపు కొడుతుందని అతని అనుచరులు చెబుతున్నారు.