కేరళలో మరో వైరస్ తో ప్రజలు టెన్షన్ పడుతున్నారు. ‘టమాటా ఫ్లూ’ వైరస్ తో బాధపడుతు పలువురు చిన్నారులు ఆస్పత్రి పాలవుతున్నారు. కరోనా వైరస్ నుంచి పూర్తిగా బయటపడకముందే తాజాగా టమాటా వైరస్ రూపంలో హడలెత్తిస్తోంది. కేరళలో వెలుగు చూసిన ‘టమాటా ఫ్లూ’ వైరస్ తో పలువురు చిన్నారులు తీవ్ర జ్వరం, వాంతులు, విరేచనాలు, ఇతర లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
ప్రమాదకర ఈ వైరస్ కారణంగా కొల్లాంలో 80 మంది చిన్నారులు ఆసుపత్రుల పాలయ్యారు. టమాటా ఫ్లూ సోకిన చిన్నారులంతా ఐదేళ్ల వయస్సువారే కావటం గమనించాల్సిన విషయం. తాజాగా కేరళలో మరో 10 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ వైరస్ వల్ల తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. కర్ణాటక రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది.