యూకేలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 'మంకీ పాక్స్' వ్యాధి కేసు ఒకటి బయటపడటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కొద్దిరోజుల కిందట నైజీరియా నుంచి వచ్చి ఓ వ్యక్తిలో ఈ వ్యాధి బయటపడినట్లుగా యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో అతడిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స చేస్తున్నారు.
బాధితుడి ఎక్కడెక్కడ తిరిగాడో గుర్తించే పనిలో పడ్డారు. ఎలుకలు, కుందేళ్లు వంటి జంతువుల నుంచి మనుషులకు ఈ మంకీ పాక్స్ వ్యాధి వస్తుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఈ వ్యాధి అంత వేగంగా మనిషి నుంచి మరో మనిషికి వ్యాపించదని నిపుణులు తెలియజేస్తున్నారు.