ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెల్లూరు జిల్లాలో.. ఇథ‌నాల్ ప్లాంట్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 13, 2022, 01:47 AM

నెల్లూరు జిల్లాలో కృష‌క్ భార‌తి కో ఆప‌రేటివ్ సొసైటీ (క్రిభ్కో) ఓ ఇథ‌నాల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయ‌నుంది. రూ.560 కోట్ల పెట్టుబ‌డితో మొద‌లు కానున్న ఈ ప్లాంట్ ద్వారా 400 మందికి ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయి. ఈ మేర‌కు ప్లాంట్ ఏర్పాటుకు ఏపీ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. గురువారం కేబినెట్ భేటీకి ముందు సీఎం జ‌గ‌న్ నేతృత్వంలో స్టేట్ ఇండ‌స్ట్రియ‌ల్ ప్ర‌మోష‌న్ బోర్డు (ఎస్ఐపీబీ) స‌మావేశ‌మైంది. నెల్లూరు జిల్లా ప‌రిధిలోని స‌ర్వేప‌ల్లిలో 100 ఎక‌రాల్లో ఈ ప్లాంట్ ఏర్పాటు కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa