పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం రావులకొలను గ్రామంలో వెలసిన మారెమ్మ దేవత ఆలయ 1వ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శనివారం ఉదయం 7 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు, తీర్థ ప్రసాద వితరణ అనంతరం అన్నదాన ఉంటుందన్నారు. యంత్రం 5 గంటలకు శ్రీరామ మహిళ కోలాట బృందం (మొర్రాయిపల్లె), కోదండరామ మహిళ కోలాట బృందం (లక్ష్మీ పేట)చే ఆలయం వద్ద కోలాటాలు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.