కరోనా కేసులు మళ్లీ ఎక్కువవుతున్నాయి. కొన్ని దేశాల్లో వీటి సంఖ్య మరింత రెట్టింపు అవుతోంది. న్యూజిలాండ్ లో కరోనా వైరస్ మళ్లీ విజృంభించడంతో టెన్షన్ నెలకొంది. న్యూజిలాండ్ దేశ ప్రధాని జసిండా అర్డెర్న్ కూడా కరోనా వైరస్ బారినపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
శనివారం మే 14వ తేదీన ఒక్కరోజే 7,122 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా 17 మరణాలు నమోదయ్యాయి. నెల రోజుల వ్యవధిలోనే 150కిపైగా మరణాలు సంభవించడంతో వైద్య నిపుణులు, అధికారులు అలర్ట్ అయ్యారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు.