తాను కొనసాగిస్తున్న అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపిది ఓ భార్య ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో శనివారం మక్తల్ పోలీస్ స్టేషన్ లో హంతకులను అరెస్టు చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం గత నెల 22న ఊట్కూరు మండలం పగిడిమారి గ్రామానికి చెందిన యూసుఫ్ అనే వ్యక్తి మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి ఇమామ్ సాబ్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు. దీంతో దర్యాప్తులో భాగంగా శవానికి రీ పోస్టుమార్టం నిర్వహించి గ్రామంలోనే ఉన్న మృతుడి భార్య ఫరజా బేగం, ప్రియుడు అరాఫత్ లను పట్టుకొని తమదైన రీతిలో విచారించడం జరిగిందన్నారు. దీంతో ఫరజా బేగం ఇంటి ముందు ఉన్న అరాఫత్ తో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో గత కొన్ని రోజులుగా భార్యభర్తల మధ్య తరుచుగా గొడవలు జరుగుతూ ఉండేవని తెలిపారు. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్న భర్తను ఎలాగైనా అడ్డు తొలగించాలనే దురుద్దేశంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయాలని పథకం పన్నరాని తెలిపారు.
గత నెల 17న రాత్రి 11 గంటలకు మద్యం తాగి వచ్చి యూసుఫ్ భార్యతో గొడవ పడుతూ ఉండగా గమనించిన ప్రియుడు అరాఫత్ ఇదే అదునుగా భావించి ఇద్దరు కలిసి యూసుఫ్ ను కొట్టి మెడకు చున్నీతో చుట్టి రెండు వైపుల ఇద్దరు కలిసి లాగుతుండగా భార్యను చేత్తో గట్టిగా కొట్టడంతో వదిలివేయడం జరిగిందని మరల భార్య రెండు కాళ్ళను గట్టిగా పట్టుకొగా ప్రియుడు యూసుఫ్ ముఖంపై మెత్తతో గట్టిగా ఒత్తి పెట్టుకోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయాడని తెలిపారు. దీంతో ఎవరికీ అనుమానం రాకుండా తన భర్త మంచం పైనుండి పడి చనిపోయాడని గ్రామస్తులను కుటుంబ సభ్యులకు తెలిపిందని వివరించారు. దీంతో కేసు నమోదు చేసుకుని హంతకులను తీసుకుని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు పంపిస్తామని పోలీసులు తెలిపారు.