గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఓ పోస్టల్ ఉద్యోగి తన చేతివాటాన్ని ప్రదర్శించాడు. పోస్టల్ కార్యాలయంలో జమ చేయాల్సిన ప్రజలు పొదుపు సొమ్ము రూ. 26 లక్షలు లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయకుండా తన వ్యక్తిగత అవసరాలకు వినియోగించాడు. సదరు విషయాన్ని గుర్తించిన అధికారులు సబ్ పోస్ట్ మాస్టర్ శివకాంత్పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వ్యవహారంపై డివిజనల్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం ఉద్యోగి శివకాంత్పై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.