మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ లెనిన్ సెంటర్‌లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సంతకాల సేకరణ, కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. మహిళల పై అత్యాచారాల నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. మద్యం, పోర్న్ వీడియోలపై నిషేధం విధించాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని, గంజాయి విక్రయాలను అరికట్టాలన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా మహిళపై అత్యాచారం జరిగినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారాలను అరికట్టేందుకు ప్రభుత్వం సమగ్ర చట్టం తీసుకొచ్చే వరకు దశలవారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని మహిళా సంఘాలు హెచ్చరించాయి.