ఏపీలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా తొలి విడత సాయాన్ని అందించనుంది. మే 16న సోమవారం రైతుల బ్యాంకు ఖాతాల్లో సంబంధిత నిధులను జమ చేయనుంది. ఇందులో భాగంగా రైతులు పెట్టుబడి సాయం కింద రూ.5,500 చొప్పున అందుకోనున్నారు. మొత్తం 48.77 లక్షల మందిని ఈ ఏడాదిలో రైతు భరోసా పథకానికి అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. పథకంలో లబ్ధిదారులైన అర్హుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శనకు ఉంచారు.
జాబితాలో పేరులేని అర్హులైన రైతులు అధికారులను సంప్రదిస్తే వారికి ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం అందనుంది. మరోవైపు జాబితాలో అనర్హుల పేరు ఉంటే వాటిని అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలో గుర్తించి తొలగించనున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల తుది జాబితా సిద్ధం అయింది. లాంఛనంగా సోమవారం అర్హుల బ్యాంకు ఖాతాలో నిధులను ప్రభుత్వం జమ