ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియుడు మృతి తట్టుకోలేక యువతి ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Mon, May 16, 2022, 12:20 PM

అందమైన భవిష్యత్తును ఊహించుకుంటూ వారిద్దరూ ప్రేమలో మునిగి తేలారు. త్వరలో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. పెద్దలను కూడా పట్టుబట్టి ఒప్పించారు. ఈ తరుణంలో రోడ్డు ప్రమాదంలో ఆ యువకుడు చనిపోయాడు. ఈ విషయం తెలిసిన అతడి ప్రేయసి తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. తన ప్రియుడు లేని లోకంలో తాను ఉండలేనని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


కర్నాటకలోని తుమకూరు తాలూకాకు చెందిన ధనుష్‌(23) అనే యువకుడు బెంగళూరులో దుస్తుల షాపు నడిపిస్తున్నాడు. అతడికి ఆరేహళ్లి గ్రామానికి చెందిన యువతి సుష్మా (22)తో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు వారి మధ్య సాన్నిహిత్యం ప్రేమగా మారింది. ఇరువురూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నారు. ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పారు. పెద్దలు వారి ప్రేమను తిరస్కరించారు. పెళ్లికి ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ వారు తమ ఇళ్లలో పెద్దలను పెళ్లికి ఒప్పించారు. త్వరలో ఈ జంటకు పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి.


ఈ తరుణంలో మే 11న తమ గ్రామంలో జరిగే జాతరకు ధనుష్‌ బైక్‌పై వెళ్లాడు. అయితే రోడ్డు ప్రమాదం జరగడంతో సంఘటనా స్థలంలోనే ధనుష్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం సుష్మాకు తెలియడంతో ఆమె గుండె బద్దలైంది. ప్రియుడి అంత్యక్రియల్లో పాల్గొని, ప్రాణాలు లేని తన ప్రియుడిని చూసి బాగా ఏడ్చింది. ప్రియుడు మృతి చెందిన మరునాడే బలవన్మరణానికి యత్నించింది. ప్రియుడు లేని జీవితం ఊహించుకోలేనని పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం కన్ను మూసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com