కార్బెవాక్స్ టీకా ధరను భారీగా తగ్గించారు. ఇప్పటివరకు డోసుకు రూ.840 ఉండగా దీన్ని రూ.250 (పన్నులతో కలిపి)కి తగ్గించినట్లు బయోలాజికల్-ఇ సంస్థ ప్రకటించింది. హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్-ఇ సంస్థ టెక్సాస్ చిల్డ్రన్ హాస్పిటల్, బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ సహకారంతో ఈ టీకాను అభివృద్ధి చేసింది. కార్బెవాక్స్ టీకాను ప్రస్తుతం 12 నుంచి 17ఏళ్ల పిల్లలకు అందిస్తున్నారు. ఇకపై వ్యాక్సిన్ కేంద్రాల్లో అదనపు ఛార్జీలతో కలిపి దీని ధర రూ.400గా ఉండనుంది. 5 నుంచి 12ఏళ్ల వయసు చిన్నారుల వినియోగానికి అనుమతి వచ్చిన కొన్ని వారాల్లోనే బయోలాజికల్-ఇ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాక్సిన్ను కొవిన్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.