కోవెలకుంట్ల పట్టణంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగడి బ్రహ్మోత్సవాల్లో సోమవారం స్వామి శేషవాహనంపై విహరించారు. ఉత్సవాల్లో భాగంగా ఆరవరోజు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు, నుదర్శనా
చార్యులు పంచామృతాభ్నోకం, మహాగణపతిపూజ, స్త్రీసూక్త, భూసూక్త విధానేన అభిషేకాలు, నంప్రోక్షణ, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రికి పాండు రంగడు శేష వాహనంపై కొలువుదీర్చగా పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయం నుంచి గాంధీసెంటర్ వరకు గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పాండురంగ విళలేశ్వరుడు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అర్చకులు పేర్కొన్నారు.