తిరుపతి గంగమ్మ జాతరను పురస్కరించుకొని దర్శనానికి వచ్చే భక్తులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేసి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని, అమ్మ వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని జనసేన ఇంచార్జి కీర్తన ఆధ్వర్యంలో గంగమ్మ తల్లిని కోరడం జరిగింది. రాష్ట్రంలో ప్రజలను పీడిస్తున్న రాజకీయాలు తొలిగిపోయి , ప్రజలకి మేలు చేసాడు నాయకుడి నాయకత్వంలో మంచి ప్రభుత్వం ఏర్పడేలా దీవించమని కోరడమైనది. ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్య నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.