ఖరీఫ్ సాగు నిమిత్తం మే నెల 20 వ తేదీ నుండి వేరుశనగ విత్తనం కాయలను డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేయనున్నట్లు సుండుపల్లి వ్యవసాయ శాఖ అధికారి మురళీధర్ తెలిపారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీలలో తమ ప్రాంతంలోని రైతు భరోసా కేంద్రాల వద్ద వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి వేరుశనగ విత్తనం కాయలను కొనుగోలు చేయాలని మురళీధర్ తెలిపారు.