ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయం అద్భుతమైన శిల్ప సంపదను కలిగి ఉన్నదని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు జడ్జి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆయన కుటుంబ సమేతంగా బుధవారం ఏకశిలపై వెలసిన సీతారామ లక్ష్మణ మూర్తులను దర్శించుకున్నారు. వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత ను అడిగి తెలుసుకున్నారు.