పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థి పై ఇన్విజిలేటర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జమ్మలమడుగు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు. కొండాపురం మండలానికి చెందిన ఓ విద్యార్థిని జమ్మలమడుగు లోని బాలికల ఉన్నత పాఠశాల లో ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాస్తోంది. ఈ నెల 14న ఇన్విజిలేటర్ గా విధులు నిర్వహిస్తున్న ఈశ్వర్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు కాపీలను తనిఖీ చేసే నెపంతో విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. పరీక్ష అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.