తిరుపతి జిల్లా (శ్రీకాళహస్తి) : కర్మక్రియల రోజే బొజ్జల ఇంట్లో మరో విషాదం. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన తమ్ముడు బొజ్జల హరినాథ్ రెడ్డి బుధవారం రాత్రి కన్నుమూశారు. సాయంత్రం స్నానానికి వెళ్లిన హరినాథ్ రెడ్డి బాత్రుంలో జారిపడ్డారు. గాయపడిన ఆయనను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఈనెల 6న కన్నుమూసిన బొజ్జల కర్మక్రియలు ఈరోజు నిర్వహించారు. ఇదేరోజు ఆయన సోదరుడు చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.