పశుపోషకుల ఇంటిముంగిటే మూగజీవాలకు మెరుగైన వైద్యసేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైయస్ఆర్ సంచార పశు ఆరోగ్యసేవలు అలాగే సుమారు రూ. 278 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తుండగా... తొలిదశలో రూ. 143 కోట్లతో సిద్ధం చేసిన 175 అంబులెన్స్‌లను తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద గురువారం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు సహా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు పాల్గొన్నారు.