సాప్ సుమ్మర్ క్యాంపు వాల్ పోస్టర్లను నగరి వైసీపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన క్రీడల శాఖ మంత్రి ఆర్ కే రోజా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం మే 22 నుండి జూన్ 5 వరకు నగర డిగ్రీ కళాశాల మైదానం లో హ్యాండ్ బాల్, వాలీ బాల్, క్రికెట్, బ్యాట్మెంటన్, బాల్ బ్యాట్మెంటన్, వ్యాయామ క్రీడలు, జిమ్, ఉదయం సాయంత్రం నిర్వహించడం జరుగుతుంది.
నగరి నియోజకవర్గంలోని క్రీడా కారులు, యువత, విద్యార్థులు పాల్గొని వారి నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవలని మంత్రి రోజా కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు నెంబర్ ను 8056116301సంప్రదించగలరు.