జిల్లాలో ఖరీఫ్ పంట సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి ఉష శ్రీ చరణ్ తెలిపారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నీటిపారుదల సలహా మండలి సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఖరీఫ్ పంట సాగుకు అవసరమైన అన్ని అంశాలపైనా సమావేశంలో చర్చించడం జరిగిందని అధికారులకు తగు సూచనలు సలహాలు చేశామన్నారు.
రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి చెరువులు కుంటలల్లో పూర్తిస్థాయిలో నీళ్ళు ఉన్నాయని, కర్రీస్ సీజన్ కు వీటిని సద్వినియోగం చేసుకుంటామని ఆమె తెలియజేశారు. అన్ని శాఖల సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.